‘ట్రింగ్ ట్రింగ్……’ ఒక మనిషిని ఫోన్ కాల్ తో కన్నా చిరాకు పుట్టేలా నిద్రలేపే విధానం ఉందంటే అది బెడ్రూమ్ లో కాలింగ్ బెల్ ద్వారా ఏమో.
నిద్రమత్తుతో కళ్లు నలుపుకుంటూ చెప్పమ్మా….అంటూ లేచింది చిట్టి.
‘అమ్మా…కొంచెం జావ పెట్టి ఇస్తావూ…అమ్మ స్నానానికి వెళ్ళింది’ అని అడగలేక అడిగిన నాన్న గొంతు విని ఒక్కసారిగా సగం నిద్రమత్తు వదిలిపోయింది.
టక్కుమని ఇదివరకు జావ పెడితే ఎంత దారుణంగా వచ్చిందో గుర్తొచ్చి ‘జావ నాకు సరిగ్గా రాదు నాన్న కావాలంటే టీ పెట్టిస్తా’ అన్నది, నాన్నకి నో చెప్పలేక ఏమో!
‘నీ చేత్తో ఎలా ఇచ్చినా తాగుతా అమ్మ పర్లేదు జావ నే పెట్టు’ అని చిట్టి వాళ్ల నాన్న చాలా తెలివిగా సమాధానం చెప్పారు.
పెద్దగా వంట రాకపోయినా జావ మాత్రం ఇరగతీసే తన అన్నయ్య చెప్పిన టిప్స్ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుని లేచి జావ చేసింది….అద్భుతంగా వచ్చింది ……అనుకుంది.
మొహం కడుక్కుని నిల్చున్న చిట్టి కి ఎందుకో ఈరోజు లెక్కల పుస్తకం కాకుండా పాట మీదకి వెళ్ళింది మనసు…..అది కూడా ఒక ప్రత్యేకమైన పాట మీదకి.
సూర్యుడితో కాసేపు ముద్దులాడదాం అంటే కొత్తగా పెళ్లైన కాపురం లోకి పక్కింటివాళ్లు పొరిగింటి వాళ్లు అడ్డొచ్చినట్టు మబ్బులు కమ్మేసాయని విసుక్కుని పాటలు వింటూ చల్లగాలిని ఆస్వాదిస్తుంది……
నిజంగానే ఒక విరించి వలే సిరివెన్నెల గారు రాసిన ‘విధాత తలపున…..’ పాట సాహిత్యాన్ని మురిసిపోతూ ఆస్వాదిస్తుంది చిట్టి….
‘అమ్మో ఎవరైనా చూస్తే ఎవరో పిల్లోడి గురించి ఆలోచిస్తూ రాత్రి చెప్పిన కబుర్లు ఏమైనా గుర్తొచ్చి నవ్వుకుంటుందా?????’ అనుకుంటారేమో అని వెంటనే ఒక సీరియస్ మొహం పెట్టుకుని లోలోపల సిగ్గుపడుతుంది….
మహాభారతం మొత్తంలో మూడు సార్లు విశ్వరూప దర్శనం ఇచ్చిన శ్రీ కృష్ణుడు,
రీల్స్ పుణ్యమాని చాలా సార్లే కనిపించాడు చిట్టికి…..కానీ దానర్థం అర్థం కాలేదు.
‘కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం…….’ అన్న లిరిక్ వింటూ తన కళ్ల ముందు ఊగుతున్న వేప చెట్టుని, గువ్వని చూస్తున్న చిట్టి ఒక్కసారిగా నివ్వెరపోయింది.
ప్రతి జీవి-అజీవి లో జీవం ఉంటుంది, పరమాత్మ ఉంటాడు అన్న ఆలోచన తోడయ్యి ఒక్కసారిగా మోక్ష ప్రసాదన అయినట్టు చిట్టి కళ్లు పెదవి అయ్యాయి.
విశ్వరూపం అంటే చెట్టు …పుట్ట….చీమ…నీరు రూపాలకి ప్రతి రూపంగా పరమాత్మ ఉండడమేనా అనిపించింది. కానీ విశ్వరూపంలో దేవుడు మనిషిలా ఉన్నాడు కదా మరి ప్రకృతి పరమాత్మ యొక్క విశ్వరూపం ఎలా అవుతుంది?? అని సందేహ పడింది.
సరదాగా ఒక సాయంత్రం చిట్టి వాళ్ల అమ్మ ‘మనుషులు దేవుడ్ని మనిషి రూపంలో ఊహించుకుంటారు…..అంటే, చేతులు, కాళ్లు, తల…చూడటానికి మనిషిని పోలినట్టు. అలాగే ప్రతి జీవరాశి దేవుడ్ని వాటి రూపంలో ఊహించుకుంటది అంట’ అని చెప్పిన కబుర్లు గుర్తొచ్చాయి.
వెంటనే చిట్టికి, ‘అంటే భగవంతుడి విశ్వరూపమే ఈ ప్రకృతి ప్రతిరూపం, దానిని పాడు చేయడమే భగవంతుడ్ని అగౌరవ పరచటం’ అనిపించింది.
తాను రోజు తినే కోడిగుడ్డు, గుడ్డు వాళ్ల అమ్మ గుర్తొచ్చి రోజు నేను భగవంతుడి ప్రతిరూపాన్ని పాడు చేస్తున్నానా అని భయపడింది చిట్టి…
మనసు ఒక కోతి అని ఊరికే అనలేదేమో, ప్రకృతి అంతా ఏకమయ్యి దానికి పాట తోడయ్యి సృష్టి రహస్యాన్ని మనిషి మస్తిష్కంలో నాటుతుంటే, మనిషి మాత్రం స్వార్థంగా తాను చేసేది పాపమా??? దానికి దేవుడు కోప్పడతాడా??? అని ఆలోచిస్తున్నాడు.
తనకి సమాధానం దొరకని చాలా ప్రశ్నల జాబితాలో ఇంకొకటి చేర్చి, వీలైనంత వరకు ప్రకృతిని పాడు చేయకూడదని సరిపెట్టుకుని, నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది చిట్టి…..

-------- Animesha
No comments:
Post a Comment