Tuesday, October 27, 2020

పంటల వ్యర్ధ పదార్ధాలు కాల్చడం వలన వచ్చే నష్టాలు


మనకి రోజు అన్నం పెట్టే  చెయ్యిని నరకడం అంతే ఇదేనేమో ...... మనకి వచ్చే లాభాలని మెరుగుపరచుకునే కంగారులో  మన చుట్టూ ఉండే నీరు , భూమి , గాలిని మన చేతులారా పాడుచేసుకుంటున్నాము . వ్యవసాయానికి పెట్టిందిపేరు ఐన మన దేశంలో సంవత్సరానికి కొన్ని భూములలో మూడు పంటలని  కూడా పండించగలుగుతున్నాము . కానీ ఈ ప్రక్రియలో మనం చేరుకొని గమ్యాన్ని మరిచిపోతున్నాము. ఒక పంట చేతికి వచ్చాకా  రెండవ పంటని అందుకునే కంగారులో  పంట వ్యర్ధ పదార్ధాన్ని అక్కడే  తగలపెడతారు . దీని వల్ల  భూమికి, తరువాత రాబోయే పంటకి మరియు మన చుట్టూ ఉండే గాలికి  కూడా ఎంతో నష్టం ఉంటదని  నిపుణులు చెప్తున్నారు 


** వ్యర్ధ పదార్ధాన్ని పండించే చోటే  తగలపెట్టడం వలన ఆ భూమిలో  (సిలికా ) పరిమాణత పెరుగిపోతుంది **

** దీనిని  కాల్చటం వలన గాలిలో అనేక రకమైన విషవాయువులు (P.M 2.5 ) కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ **

** మరియు దీని నుండి వచ్చే వేడి భూమిలోకి చొచ్చుకునిపోవడం వలన భూమి తేమని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి **

** దీని నుండి వచ్చే విష వాయువులు ఢిల్లీ పరిసర ప్రాంతాలలో వాయు కాలుష్యానికి ప్రధమ కారణాలుగా కేంద్రం గుర్తించింది **


ఇన్ని నష్టాలూ ఉన్నా ఎందుకు పాటిస్తున్నాము?

1) రెండవ పంట వేసే కంగారులో ఈ  సులభమైన పద్ధతిని ఎంచుకుంటున్నాము 

2) దీనికి బదులు మెషిన్ కటింగ్ పద్ధతి  వున్నా సరే అంత పెట్టుబడి సన్నకారు రైతులు వద్ద ఉండకపోవడం వలన 

3) చాల మందికి ఈ  విషయంపైనా అవగాహన ఉండకపోవటం వలన 


మరి మనం ఎం చేయగలము ?


1) మెషిన్ కట్టింగని  తక్కువ ధరకి అందించేలాగా సాంకేతిక వైజ్ఞ్యానాన్ని  అందుబాటులోకి తేవడం 

2) ఈ  వ్యర్ధాన్ని ఆవుపేడ మరియు ఇతర పదార్ధాలతో కలిపినపుడు ఎంతో విలువైన సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఇతర రాష్ట్రాల్లో రైతులుకి సరిపడా డబ్బుని అందచేసి, వారి దగ్గరనుండి వ్యర్ధాన్ని సేకరించి  ప్రభుత్వమే ఈ  పద్ధతిలో ఎరువులని తయారుచేస్తుంది .  

3)మరియు ఇతర దేశాల్లో దీనినుండి  విద్యుత్పత్తి కూడా చేస్తున్నారు . దేని వల్ల పెట్రోల్ , బొగ్గు మీద ఆధార పడటం తగ్గుతుంది 

4) ఛత్తీస్గఢ్ లో సన్నకారు రైతులు "గౌతన్ "గా  ఏర్పడి ఊరుకి 5 ఎకరాల చప్పున  భూమిలో ఈ వ్యర్ధ పదా ర్ధాలని సేకరించి సేంద్రియ ఎరువులని తయారుచేసి తిరిగి వారి భూమిలో వాడుకుంటున్నారు . 


రచన : కె . కృష్ణ అమృత 


THE ARC IN US

                                                                                     Many times, we see a person and wonder ...